: ‘బీఫ్’పై రాజకీయాలు చాలా దౌర్భాగ్యం: కేసీఆర్
‘బీఫ్’పై రాజకీయాలు చేయడం చాలా దౌర్భాగ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎవరికి ఇష్టమైన ఆహారం వారు తీసుకుంటారని..దానిపై రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేదైనా ఉంటుందా? అని కేసీఆర్ అన్నారు. ‘బీఫ్’ ఒక అంశంగా చేసే స్థాయికి రాజకీయ పార్టీ వెళ్లడమే దిక్కుమాలినతనమన్నారు. కొన్ని దేశాల్లో కప్పలు, పాములు కూడా తింటారని, ఎవరికి అందుబాటులో ఉండే ఆహారాన్ని వారు తీసుకుంటున్నారని.. అదేవిధంగా బీఫ్ ను కొంతమంది ఆహారంగా తీసుకుంటారని అన్నారు. అసలు, బీఫ్ పై ప్రశ్నించడమే అనవసరమని, ఇది తలాతోక లేని ప్రశ్న అని కేసీఆర్ అన్నారు.