: 'బిర్యానీ' ఆఫర్ తో చెరువుకు మహర్దశ!


ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేరళలోని కోజికోడ్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న 14 ఎకరాల ఓ పెద్ద చెరువుకు మహర్దశ పట్టింది. అప్పటివరకు అది చెత్తాచెదారం, కలుపుమొక్కలతో నిండిపోయి ఉంది. దానివైపు నుంచి వెళ్లే వారు వాసన భరించలేకపోయేవారు. అయితే దాన్నెలాగైనా శుభ్రం చేయించాలనుకున్న కలెక్టెర్ ఎన్.ప్రశాంత్ భూషణ్ విభిన్నమైన ఆలోచనతో పని పూర్తి చేసేశారు. ఈ క్రమంలో చెరువును శుభ్రం చేసేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని సోషల్ మీడియా ద్వారా కోరారు. అలా ఎవరైతే వస్తారో వారందరికీ మాంచి వేడి వేడి బిర్యానీ సిద్ధంగా ఉందని ఆఫర్ ప్రకటించారు. భారీ ఎత్తున స్పందించిన ఐదువందల మంది స్థానికులు చెరువులో చెత్తంతా నాలుగు గంటల్లో తొలగించి శుభ్రం చేశారు. వారితో పాటు కలెక్టర్ కూడా చెత్త తొలగింపులో పాల్గొన్నారు. తరువాత అందరూ శుభ్రంగా కాళ్లు చేతులు కడుక్కుని కాస్సేపట్లోనే బిర్యానీ వండేశారు. తర్వాత కలెక్టరే స్వయంగా వారందరికీ వేడివేడి వడ్డించారు. ప్రభుత్వం జల వనరుల్ని శుభ్రం చేయించేందుకు ఇచ్చిన నిధులను ఇలా బిర్యానీ తయారీకి ఉపయోగించారు. మొత్తానికి బిర్యానీ ఆఫర్ తో చెరువు మునుపటి కళ సంతరించుకోవడాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. ఇందుకు కలెక్టర్ ప్రశాంత్ ను కూడా ప్రశంసిస్తున్నారు.

  • Loading...

More Telugu News