: రాష్ట్ర మంత్రి నాపై దాడికి యత్నించారు: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్
అరుణాచల్ ప్రదేశ్ మంత్రి తనపై దాడికి యత్నించారని ఆ రాష్ట్ర గవర్నర్ జేపీ రాజ్ ఖోవా ఆరోపించారు. ఈ మేరకు ఓ నివేదికను ఆయన సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం కనబడుతోంది. రాష్ట్రంలో దిగజారుతున్న రాజకీయ పరిస్థితులను కూడా ఆయన నివేదిక రూపంలో అత్యున్నత న్యాయస్థానానికి అందజేయనున్నారు. ముఖ్యమంత్రి నబమ్ టుకి మంత్రివర్గంలోని మంత్రులు గత డిసెంబర్ 14న గవర్నర్ రాజ్ ఖోవాను కలిసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ముందుకు జరపాలని వారు కోరారు. ఆ సమయంలో అక్కడున్న మంత్రి ఒకరు తనపై దాడికి యత్నించారని ఆయన తెలిపారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు దిగజారినందున రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసింది. దీనిపై సుప్రీంకోర్టు గవర్నర్ ను వివరణ కోరిన సంగతి తెలిసిందే.