: ముగిసిన నారాయణఖేడ్ నామినేషన్ల పరిశీలన... బరిలో 9మంది అభ్యర్థులు


మెదక్ జిల్లా నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికకు నేటితో నామినేషన్ల పరిశీలన ముగిసింది. దాఖలైన మొత్తం నామినేషన్లలో మూడింటిని తిరస్కరించగా చివరికి పోటీలో 9 మంది నిలిచారు. ప్రధానంగా టీఆర్ఎస్ అభ్యర్థిగా రాం భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి, టీడీపీ-బీజేపీ అభ్యర్థిగా విజయపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గంలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 13న నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగనుండగా, 16న కౌంటింగ్ జరగనుంది.

  • Loading...

More Telugu News