: ట్విట్టర్ లో కేటీఆర్, లోకేశ్ ల పరస్పర ట్వీట్లు
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రచారం ద్వారా కాకుండా సోషల్ మీడియాలో కూడా తెలంగాణ మంత్రి కేటీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లు ఒకరిపై మరొకరు మాటల తూటాలు సంధించుకుంటున్నారు. గ్రేటర్ ప్రచారంలో ఉండగా అనసూయ అనే మహిళ తన వాహనానికి అడ్డుపడిందని, తాను కేటీఆర్ అనుకొని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేసిందంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. ఆ మహిళ ఫోటో కూడా పోస్టు చేశారు. దాన్నంతటినీ కేటీఆర్ ఖాతాకు ట్యాగ్ చేశారు. ఇందుకు వెంటనే స్పందించిన కేటీఆర్, ఇప్పటికైనా అధికారంలో ఉన్న తామే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వగలమని గుర్తించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. అనసూయ లాంటి పేదవారినందరినీ తమ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో గ్రేటర్ ప్రచారంలో ఉన్న లోకేశ్ కు 'బెస్ట్ ఆఫ్ లక్' చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో 'మెరుగైన పార్టీ' విజయం సాధించాలని ఆయన ట్వీట్ చేశారు.