: ఒక పక్క కోడెదూడను... రెండో పక్క దున్నపోతును కట్టేస్తే కుదరదు: కేసీఆర్


'ఒక పక్క కోడెదూడను..రెండో పక్క దున్నపోతును కట్టేస్తే బండి నడవదు.. అది కుదరదు' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈరోజు హైదరాబాదులో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. తగిన వాళ్లకి ఓటు వేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పేందుకే తాను ఈ ఉదాహరణ చెప్పానని అన్నారు. జంటనగరాల ప్రజలు ఆలోచించి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ఇప్పుడున్న పార్టీలన్నీ ఆకాశం నుంచి ఊడిపడినవేమీ కాదని.. ఆ పార్టీల గురించి ప్రజలందరికీ తెలుసని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల హయాంలోనే భూకబ్జాలు, దారుణాలు జరిగాయని, మూసీ నదిని మురికి కూపంగా మార్చిన ఘనత గత ప్రభుత్వాలదేనని అన్నారు. ఇప్పుడవే పార్టీలు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News