: మహారాష్ట్ర ప్రభుత్వం కంటే ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సల్మాన్?
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు విముక్తి కల్పించడంపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న సంగతి విదితమే. అంతకంటే ముందే సల్మాన్ ఖాన్ తన వాదనలు వినాల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నాడని సమాచారం. కేవియట్ పిటిషన్ దాఖలు చేసి, బాంబే హైకోర్టు తీర్పుపై తన వాదనలు వినాల్సిందిగా కోరనున్నాడు. తద్వారా తనను నిర్దోషిగా విడుదల చేయడం తప్పుకాదు అనే వాదనను బలంగా వినిపించనున్నాడు. కాగా, దీనిపై సల్మాన్ లేదా అతని తరుపు న్యాయవాదుల నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సిఉంది. సుదీర్ఘ కాలం విచారణలో నలిగిన హిట్ అండ్ రన్ కేసులో హైకోర్టు సల్మాన్ ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.