: నటుడు మోహన్ లాల్ కు తృటిలో తప్పిన ప్రమాదం!
‘పులి మురుగన్’ సినిమా షూటింగ్ కు వెళుతున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కేరళలోని మళయత్తూర్ సమీపంలో మోహన్ లాల్ ప్రయాణిస్తున్న కారు, స్పీడ్ గా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. కాగా, ఈ చిత్రం షూటింగ్ జరుగుతున్న సందర్భంలో దర్శకుడు వైశాఖ్ కు కూడా చిన్న ప్రమాదం జరిగింది. అయితే, ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. కారు ఛేజ్ కు సంబంధించిన సన్నివేశాలను తన మొబైల్ లో ఆయన రికార్డు చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. పులి మురుగన్ చిత్రంలో నటిస్తున్న మోహన్ లాల్ తెలుగులో కూడా రెండు సినిమాలను అంగీకరించిన విషయం తెలిసిందే.