: రిపబ్లిక్ డే వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్ లు!
యావత్ జాతి సిగ్గుపడేలా కర్నాటకలోని బీజాపూర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రవర్తించాడు. రిపబ్లిక్ డే సందర్భంగా సత్ప్రవర్తన ఖైదీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల పేరిట రికార్డింగ్ డ్యాన్స్ లను జైలు ఆవరణలో నిర్వహించారు. డ్యాన్లర్లు డ్యాన్స్ చేస్తుంటే వారిపై కరెన్సీ నోట్లను చల్లుతూ సూపరింటెండెంట్ అటూఇటూ తిరిగాడు. ఈ సంఘటనపై పలు విమర్శలు తలెత్తాయి. జాతీయగీతాలు, భక్తి గీతాలను ఆలపించే కార్యక్రమానికి బదులుగా రికార్డింగ్ డ్యాన్స్ లు నిర్వహించడమేమిటని పలువురు బాహాటంగానే మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సమాచారం పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో సదరు సూపరింటెండెంట్ ని సస్పెండ్ చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.