: టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అరిందమ్ సేన్ కన్నుమూత


టైమ్స్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ ఎడిటర్ అరిందమ్ సేన్ గుప్తా కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థతో అరిందమ్ కు సుదీర్ఘకాల అనుబంధం ఉంది. 1988లో మొదటిసారి ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. మధ్యలో బయటకు వెళ్లిన ఆయన 1991లో తిరిగి టైమ్స్ కి చేరి పొలిటికల్, ఎకనమిక్ టైమ్స్ ఢిల్లీ ఎడిషన్ ఎడిటర్, టైమ్స్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే అరిందమ్ టైమ్స్ మేనేజింగ్ ఎడిటర్ గా నియమితులయ్యారు. ఆయన మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో సంతాపం తెలియజేశారు. అలాగే, పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు కూడా సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News