: కేరళ సీఎంపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం.. చాందీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
కేరళలో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ కాంగ్రెస్ ను కుదిపేసిన సోలార్ కుంభకోణం ఆ పార్టీ సీనియర్ నేత, కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీపై కేసుకు కారణం కానుంది. సోలార్ కుంభకోణంలో చాందీ ప్రమేయముందన్న ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని కొద్దిసేపటి క్రితం ఆ రాష్ట్ర విజిలెన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే తిరువనంతపురంలోని అసెంబ్లీ, సచివాలయం ముందు ఆందోళనకు దిగిన విపక్షాలు... సీఎం పదవికి చాందీ రాజానామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విజిలెన్స్ కోర్టు తీర్పు, విపక్షాల ఆందోళనలతో కేరళలో పరిస్థితులు వేడెక్కాయి.