: ఐపీఎల్ లోకి కోకా-కోలా ఎంట్రీ?... స్పాన్సరర్ గా వ్యవహరిస్తామంటూ ఢిల్లీ, ముంబై జట్లకు ఆఫర్


సాఫ్ట్ డ్రింక్స్, బేవరేజెస్ లో పేరుగాంచిన బహుళ జాతి సంస్థ కోకా-కోలా... విశ్వవ్యాప్తంగా బహుళ ప్రజాదరణ పొందిన ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ స్పాన్సరర్ గా వ్యవహరిస్తున్న తన ప్రత్యర్థి పెప్సీకో గడువు గత సీజన్ తోనే ముగిసింది. ఈ నేపథ్యంలో నిన్నటిదాకా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు వీలు లేని కోకా-కోలా... తన ప్రత్యర్థి అలా తప్పుకోగానే, ఇలా రంగప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్ డెవిల్స్, ముంబై ఇండియన్స్ జట్లతో ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు కూడా జరిపారట. అఫీసియల్ స్పాన్సరర్లుగా వ్యవహరిస్తామంటూ ఆ సంస్థ చేసిన ప్రతిపాదనకు ఆ రెండు జట్లు కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ రెండు జట్లతోనే కాక మిగిలిన జట్లతోనూ చర్చలు జరిపేందుకు ఆ సంస్థ ప్రతినిధులు సైలెంట్ గానే పని చక్కబెట్టేస్తున్నట్లు వినికిడి.

  • Loading...

More Telugu News