: చోటా లాలూ సభలో ఐటం సాంగులు... మండిపడుతున్న విపక్షాలు


బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలోని కీలక రాజకీయ పార్టీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏ పని చేసినా సంచలనమే. దాణా కుంభకోణంలో ‘గడ్డి’ మేసిన నేపథ్యంలో చట్టసభలకు లాలూ దాదాపుగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో మొన్నటి ఎన్నికల్లో రాజకీయ తెరంగేట్రం చేసిన లాలూ సుపుత్రుడు తేజస్వీ యాదవ్ విజయఢంకా మోగించడమే కాక తొలి యత్నంలోనే డిప్యూటీ సీఎం పీఠం ఎక్కేశారు. ఆహార్యంలోనే కాక మాటతీరులోనూ తండ్రిలాగే దూసుకెళుతున్న తేజస్వీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తేజస్వీ యాదవ్ హాజరైన ఓ సభ ఐటం సాంగులతో హోరెత్తిపోయింది. సభలో వరుసగా ప్లే అయిన ఐటం సాంగులకు రికార్డింగ్ డ్యాన్సర్లు కూడా స్టెప్పులతో సందడి చేశారు. ఈ వీడియోలు ప్రస్తుతం జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నేత... ఐటం సాంగుల సభలకు ఎలా హాజరవుతారని విపక్షాలు స్వరం పెంచాయి.

  • Loading...

More Telugu News