: ఆంధ్ర ప్రాంత కేటాయింపులను రద్దు చేయాలి: గాంధీ ఆసుపత్రి వైద్యుల డిమాండ్


ఉద్యోగుల విభజన, పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని, ఆంధ్ర ప్రాంత కేటాయింపులను రద్దు చేయాలని గాంధీ ఆసుపత్రి వైద్యులు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో వైద్యుల ఆందోళన రెండో రోజు కూడా కొనసాగుతోంది. విధులు బహిష్కరించిన సుమారు 500 మందికి పైగా వైద్యులు, సిబ్బంది ధర్నాలో పాల్గొన్నారు. కమల్ నాథన్ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి అన్యాయం చేశారని, డీఎంఈ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ వైద్యులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కోఠిలోని డీఎంఈ కార్యాలయం ముట్టడికి వారు బయలుదేరారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీని నిలిపివేశారు. వైద్యులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Loading...

More Telugu News