: కోహ్లీ పాకిస్థాన్ అభిమాని ఉమర్ కు రిమాండ్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ పాకిస్థాన్ అభిమాని ఉమర్ ద్రాజ్ (22)ను రిమాండ్ కు తరలించారు. అతనిపై పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశమున్న సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఒకారా జిల్లాకు చెందిన ఉమర్ కోహ్లీకి వీరాభిమాని. భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆస్ట్రేలియాతో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఇందుకు ఉబ్బితబ్బిబ్బయిన ఉమర్ పాక్ లోని తన నివాసంపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. ఇది తెలిసిన స్థానిక పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కేవలం కోహ్లీపై అభిమానంతోనే భారత జెండా ఎగురవేశానని, అది నేరమని తనకు తెలియదని ఉమర్ అంటున్నాడు. తనను కోహ్లీ అభిమానిగానే చూడాలని కోరుతున్నాడు.