: ఏపీ పోలీసుల ఎదుట లొంగిపోయిన గంజాయి స్మగ్లర్ శివశంకర్ రెడ్డి
గంజాయి స్మగ్లర్ అవుకు శివశంకర్ రెడ్డి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అనంతరం అతడిని విచారించగా పోలీసులకు పలు కీలక విషయాలు చెప్పాడని తెలుస్తోంది. ప్రతిరోజూ మహారాష్ట్రకు వందల టన్నుల్లో గంజాయిని తరలిస్తుంటామని, దీనిని నిల్వ చేసేందుకు విజయవాడలోని పలు ప్రాంతాల్లో గోడౌన్ లు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపాడు. ఈ సందర్భంగా శివశంకర్ కు సంబంధించిన 3 నెలల ఫోన్ కాల్స్ డేటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనిది కృష్ణాజిల్లా కుంచనపల్లి. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు కేసులో ఇతను ప్రధాన నిందితుడు.