: తిరుపతిలో ‘ఉగ్ర’ కలకలం... విష్ణునివాసం ఎదురుగా డ్రైనేజీలో రెండు తుపాకులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో ఉగ్రవాదుల కలకలం రేగింది. ఐఎస్ఐకి చెందిన ఉగ్రవాది నగరంలోకి చొరబడ్డాడన్న విశ్వసనీయ సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల బెంగళూరులో అరెస్టైన తీవ్రవాది ఒకడు విచారణలో భాగంగా తిరుపతిలోకి ప్రవేశించిన మరో ఉగ్రవాదికి సంబంధించిన సమాచారం ఇచ్చాడు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన ఎన్ఐఏ అధికారులు నిన్ననే తిరుపతిలోకి ఎంటరయ్యారు. నగరవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నేటి ఉదయం తిరుమల భక్తుల విడిది కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన విష్ణునివాసం ఎదురుగా ఉన్న డ్రైనేజీలో ఎన్ఐఏ అధికారులు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉగ్రవాది సంచారాన్ని నిర్ధారించుకున్న ఎన్ఐఏ అధికారులు సోదాలను మరింత ముమ్మరం చేశారు.