: అమాంతం పెరిగిన ఫేస్ బుక్ షేర్లు... ప్రపంచ ఆరో ధనవంతుడిగా జుకర్ బర్గ్


ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ పాప్యులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఆయన ప్రపంచ సంపన్నుల్లో మొదటి పదిమందిలో ఒకరిగా నిలిచి ఆరో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం... నిన్న(బుధవారం) ఫేస్ బుక్ షేర్లు ఒక్కసారిగా 12 శాతం పెరగడమే. దాంతో జుకర్ ఆస్తి 4.85 డాలర్లకు పెరగగా... ఆయన సంపద 46.25 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ క్రమంలో 'ఒరాకిల్' ఛైర్మన్ లారీ ఎలిసన్ కన్నా జుకర్ సంపద సుమారు 2.5 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఎలిసన్ సంపద 43.6 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఒరాకిల్ ఛైర్మన్ ను వెనక్కునెట్టి ఆయన స్థానాన్ని జుకర్ ఆక్రమించారు.

  • Loading...

More Telugu News