: ప.గో.జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆస్తులు అటాచ్ చేసిన ఏసీబీ


పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తులను ఏసీబీ ఇవాళ అటాచ్ చేసింది. ఆ వెంటనే ఆయన్ను విధుల నుంచి ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో గతవారంలో విజయవాడలోని ఆదిశేషు నివాసం, ప.గో. జిల్లాలోని ఏలూరు, గుంటూరు జిల్లాలలోని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో దాదాపు రూ.130 కోట్ల విలువైన అక్రమాస్తులను కనుగొన్నారు. అందులో స్థిర, చరాస్థులు, కొంతమొత్తం నగదు, భారీగా ఆభరణాలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News