: కోరిన కోర్కెలు తీరితే.. బిచ్చమెత్తడమే అక్కడి మొక్కు!


కోరిన కోర్కెలు తీరితే దేవుడికి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. హుండీలో డబ్బులు వేయడం, పూజలు చేయించడం, కొత్త వస్త్రాలు ఇవ్వడం, అభిషేకాలు ..ఇట్లా పలు రకాలు మొక్కులు చెల్లించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే, ఈ విషయంలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని కొప్పవరం ‘సత్తెమ్మ తల్లి’ అమ్మవారు ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే, రెండేళ్ల కొకసారి ఇక్కడ జరిగే జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కోరిన కోర్కెలు తీరితే ఇక్కడ మొక్కేమిటంటే.. బిచ్చమెత్తడం. అలా వచ్చిన సొమ్మును, కానుకలను అమ్మవారి హుండీలో వేసి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకోసం చిత్ర, విచిత్ర వేషాలు ధరించి బిచ్చ మెత్తుతుంటారు. కర్రి వంశీకుల ఆడపడచుగా పూజలందుకునే సత్తెమ్మ తల్లి జాతర నిన్నటితో ముగిసింది. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కూడా బిచ్చమెత్తి తమ మొక్కు తీర్చుకున్నారు.

  • Loading...

More Telugu News