: ‘కాంగ్రెస్ వర్సెస్ ఆల్’ గతం... ఇప్పుడంతా ‘మోదీ వర్సెస్ ఆల్’: అమిత్ షా కామెంట్స్


బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా నేడు రెండో టెర్మ్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన నిన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘హిందూస్థాన్ టైమ్స్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే (కాంగ్రెస్ వర్సెస్ ఆల్), (ఇందిరా గాంధీ వర్సెస్ ఆల్)... ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడంతా ‘బీజేపీ వర్సెస్ ఆల్’, ‘మోదీ వర్సెస్ ఆల్’గా పరిస్థితి మారిందని ఆయన చెప్పుకొచ్చారు. ఆయా పార్టీలు తమ మనుగడను కాపాడుకునేందుకు తమ సిద్ధాంతాలను పక్కనబెట్టేశాయని కూడా ఆయన ఆరోపించారు. ఈ తరహా ఆసక్తికర పోరులో తమ పార్టీ సత్తా చాటుతుందని కూడా అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News