: రాబర్ట్ వాద్రాకు క్లీన్ చిట్ ఇవ్వలేదుగా!... రాజస్థాన్ హోం మంత్రి కీలక వ్యాఖ్య


రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా నిన్న పింక్ సిటీ జైపూర్ లో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను కలవరానికి గురి చేశాయనే చెప్పాలి. తమ రాష్ట్రంలో చోటుచేసుకున్న అక్రమ భూ కొనుగోళ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు తాము ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని ఆయన ప్రకటించారు. నకిలీ పేర్లతో భూములను కొన్న కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కటారియా పేర్కిన్నారు. ఈ కేసులో ‘ఫస్ట్ పార్టీ’గా ఉన్న 18 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశామని చెప్పిన ఆయన, దర్యాప్తులో తదుపరి చర్యలను తాను ఇప్పుడే చెప్పలేనని అన్నారు. ఈ కేసులో రాబర్ట్ వాద్రా కంపెనీలు థర్డ్, ఫోర్త్ పార్టీలుగా ఉన్నాయని ఆయన తెలిపారు. దర్యాప్తులో తదుపరి తేలే అంశాల ఆధారంగానే చర్యలూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News