: రంగంలోకి ఇద్దరు చంద్రులు... గ్రేటర్ ప్రచారానికి చంద్రబాబు, కేసీఆర్
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం నేటి నుంచి మరింత ముమ్మరం కానుంది. ఇప్పటికే అన్ని పార్టీల ప్రధాన నేతలు నగరంలోని వీధుల్లో కలియ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం చెమటోడుస్తున్నారు. తాజాగా నేటి నుంచి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా రంగంలోకి దిగనున్నారు. నేటి మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్న కేసీఆర్ ప్రధానంగా గ్రేటర్ ఎన్నికలపైనే మాట్లాడనున్నారు. ఇక నేటి నుంచి రెండు రోజుల పాటు చంద్రబాబు గ్రేటర్ పరిధిలో టీడీపీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించనున్నారు.