: అప్పటి నుంచీ ఎన్టీఆర్ నన్ను తమ్ముడూ అంటూనే పిలిచేవారు!: సీనియర్ నటుడు జేవీ రమణమూర్తి


తనను తమ్ముడూ అనే ఎన్టీఆర్ ఎప్పుడూ పిలిచేవారని సీనియర్ నటుడు జేవీ రమణమూర్తి అన్నారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం-2015 ను ఆయనకు ప్రదానం చేశారు. అనంతరం రమణమూర్తి మాట్లాడుతూ, రంగస్థలంపై తాను వేసిన నాటకాలు, సినిమాలలో తాను నటించిన పాత్రల గురించి గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో కలిసి నటించిన ‘శభాష్ రాముడు’ చిత్రం షూటింగ్ విశేషాలను ఆయన ప్రస్తావించారు. ‘ఈ సినిమాలో ఒక సీన్ లో నా నటన బాగుండడంతో ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. ‘భలే.. భలే.. తమ్ముడు’ అంటూ ఎన్టీఆర్ నా భుజంపై చరిచారు. ఇక అప్పటి నుంచి ఆయన నన్ను తమ్ముడు అని .. నేను ‘అన్న గారు' అని పిలవడం మొదలైంది’ అని రమణమూర్తి నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

  • Loading...

More Telugu News