: సినీ నటుడు ఆర్.నారాయణమూర్తికి పితృవియోగం!
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి తండ్రి చిన్నయ్యనాయుడు(97) ఈరోజు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం ఎస్. పైడిపాల పంచాయతీ పరిధిలోని మల్లంపేట గ్రామంలో చిన్నయ్యనాయుడు తుదిశ్వాస విడిచారు. కాగా, నారాయణమూర్తికి పితృవియోగంపై పలువురు కళాకారులు సంతాపం తెలిపారు.