: గవర్నర్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలు: తులసిరెడ్డి
పచ్చి అబద్ధాలతో టీడీపీ రాసిచ్చిన ప్రసంగాన్నే గవర్నర్ నరసింహన్ రిపబ్లిక్ డే సందర్భంగా చదివారని పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగిన 19 నెలల్లోనే ఏపీ రికార్డు స్థాయిలో వృద్ధి సాధించిందని, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో తొలి అర్ధ సంవత్సరంలోనే 27.17 శాతం వృద్ధి నమోదైందని... ఇలా కొనసాగే ఈ ప్రసంగంలో అన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఆయన అన్నారు.