: టీఆర్ఎస్ ఓడిపోతే నా పదవిని వదిలేస్తా.. గెలిస్తే, మీ పదవులు వదులుకుంటారా?: హరీష్ రావు


మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతే కనుక తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి హరీష్ రావు ధీమాగా చెప్పారు. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని హరీష్ రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు చేతకాకపోతే నోరు మూసుకోవాలని, అవాకులు చవాకులు పేలొద్దని అన్నారు. ఓటమి భయంతోనే వారు ఈ విధంగా మాట్లాడుతున్నారని హరీష్ విమర్శించారు.

  • Loading...

More Telugu News