: సమస్యలను పక్కనపెట్టి, కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారు!: నారా లోకేశ్


తెలంగాణలో సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, 20 నెలల కాలంలో కేసీఆర్ సర్కార్ ఒరగబెట్టిందేమిటని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు చొరవతోనే కేంద్రం తెలంగాణకు 50 వేల ఇళ్లు ఇచ్చిందని, హైదరాబాద్ కు కృష్ణా నీరు తెచ్చింది చంద్రబాబేనని అన్నారు.

  • Loading...

More Telugu News