: రైతులకు తీపి కబురు.. కొబ్బరి చెట్లకు బీమా పథకం వర్తింపు!


కొబ్బరి రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొబ్బరి చెట్లకు బీమా పథకం వర్తింపజేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు నుంచి అరవై ఏళ్ల వయస్సున్న సాధారణ రకానికి చెందిన కొబ్బరి చెట్లు, ఏడు నుంచి అరవై ఏళ్ల వయస్సున్న పొడుగు రకం కొబ్బరి చెట్లు ఈ బీమా పరిధిలోకి వస్తాయి. వరదలు, తుపాను, భూకంపాలు, కొండ చరియలు విరిగిపడటం వంటి మొదలైన ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన కొబ్బరిచెట్లకు బీమా కింద నష్ట పరిహారం లభిస్తుంది. నాలుగు నుంచి పదిహేనేళ్ల వయస్సున్న ఒక్కొక్క కొబ్బరి చెట్టుకు రూ.15, పదహారు నుంచి అరవై ఏళ్ల వయస్సున్న కొబ్బరి చెట్టుకు రూ.14 చొప్పున ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా ఏడాదికి ప్రీమియం చెల్లించాల్సి ఉన్నప్పటికీ, మూడేళ్ల కాలానికి ఒకేసారి ప్రీమియం చెల్లించే వెసులు బాటు కల్పించారు. ప్రీమియం మొత్తంలో కేవలం 25 శాతం మాత్రమే రైతు భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. భారతీయ వ్యవసాయ బీమా సంస్థ దీనికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది.

  • Loading...

More Telugu News