: సముద్రంపై పట్టుబిగిస్తున్న చైనా...నీటిపై అణువిద్యుత్ కేంద్రం


చైనా సముద్రంపై పట్టుబిగిస్తోంది. ప్రపంచ సైనిక పాటవంలో అగ్రస్థానంలో ఉన్న చైనా సముద్రతలంపై మాత్రం నెంబర్ వన్ గా నిలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి, అమలు చేస్తోంది. ఇప్పటికే చైనా సముద్రంలో నిఘాను పటిష్ఠం చేసిన చైనా, హిందూ మహాసముద్రం వరకు విస్తరిస్తోంది. శ్రీలంక, పాకిస్థాన్ తో వివిధ ఒప్పందాలు చేసుకున్న చైనా, ఆసియాలో అత్యంత కీలకమైన భారత్ ను అష్టదిగ్భంధనం చేసే చర్యలు చేపట్టింది. సముద్రం తలంపై సైనికపాటవం పెంచుకునే చర్యల్లో భాగంగా నీటిపై తేలియాడే అణువిద్యుత్ కేంద్రాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. సాంకేతికంగా, భద్రతా పరంగా పరీక్షించిన తరువాతే దీనిని ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించింది. అత్యున్నత శక్తిగా ఎదిగేందుకు చిత్తశుద్ధిగా పని చేస్తున్న చైనా, సముద్ర తలాన్ని పూర్తిగా వినియోగించుకోనుందని చైనా అటామిక్ ఎనర్జీ ఛైర్మన్ జు డాజ్ తెలిపారు. సముద్రంలో అణువిద్యుత్ పాత్ర గణనీయంగా పెరిగిందని, విమాన వాహకనౌకలు, క్షిపణులతో కూడిన సబ్ మెరేన్ లు అణువిద్యుత్ పై ఆధారపడ్డాయని ఆయన వెల్లడించారు. కాగా, రష్యా కూడా ఇలాంటి ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News