: పెద్దలు పద్ధతిగానే ఉన్నారు...యువతే తీవ్రవాదం బాటపడుతున్నారు: టీఆర్ఎస్ ఎంపీ కవిత వ్యాఖ్యలు
హైదరాబాదులో విద్వేషాలు రేపి పబ్బం గడుపుకునేందుకు ఎంఐఎం, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. జర్నలిస్టు సంఘాలు నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ముస్లింలంతా తీవ్రవాదులు కాదన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఇస్లాంలో తీవ్రవాదానికి స్థానం లేదని ఆమె స్పష్టం చేశారు. పెద్దలంతా పద్ధతిగానే ఉన్నారని చెప్పిన కవిత, యువత మాత్రం పెడదారి పడుతోందని పేర్కొన్నారు. యువకులు ఐఎస్ఐఎస్ వంటి తీవ్రవాద సంస్థల మాయలో పడడానికి కారణం మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమేనని ఆమె తెలిపారు. హైదరాబాదు యువత ఐఎస్ఐఎస్ మాయలో పడడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్న ఆమె, తీవ్రవాదులపై చర్యలు తీసుకోవడంలో రాజీపడమని ఆమె స్పష్టం చేశారు.