: ఎమ్మెల్యే అనిత దావా నోటీసులు నాకు అందలేదు: ఎమ్మెల్యే రోజా


టీడీపీ పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత దావా నోటీసులు ఇంకా తనకు అందలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా తెలిపారు. నోటీసులు అందిన వెంటనే చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ఓ దళిత ఎమ్మెల్యేను పావులా టీడీపీ వాడుకుంటోందన్న రోజా, ఎమ్మెల్యే అనితతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని పేర్కొన్నారు. అయితే తాను ఎలాంటి తప్పూ చేయలేదని తెలిపారు. తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజాపై కోటి రూపాయలకు దావా వేస్తున్నానని, నోటీసులు పంపించానని ఇవాళ అనిత తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News