: కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పరిగెడుతున్న ఆస్ట్రేలియా ఎంపీ పాట్ ఫార్మర్
తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు ఆస్ట్రేలియా ఎంపీ పాట్ ఫార్మర్ మారథాన్ ప్రారంభించారు. ఆల్ట్రా లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయిన పాట్ ఫార్మర్ 4,600 కిలో మీటర్ల దూరం పరుగెత్తనున్నారు. రోజుకు 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు ఆయన పరుగెత్తనున్నారు. భారత గణతంత్రదినోత్సవం, ఆస్ట్రేలియా డే కలిసి రావడంతో ఆయన ఈ మారథాన్ ప్రారంభించారు. భారత్, ఆస్ట్రేలియా దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చడానికి తోడు, బాలికా విద్యకు సహాయం చేసేందుకు విరాళాల సేకరణకు ఈ మారథాన్ చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. భారత్ లో మారథాన్ నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.