: ఏపీ ప్రభుత్వానికి కొత్త సీఎస్... 31న ఐవైఆర్ కృష్ణారావు పదవీ విరమణ
ఆంధ్రప్రదేశ్ కు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం కాబోతున్నారు. కొత్త సీఎస్ గా ఇప్పటికే ఎస్.పి.టక్కర్ పేరు ఖరారవగా, ఆయన నియామకంపై ఇవాళ సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్నారు. దాంతో నూతన సీఎస్ నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఏపీ విభజన జరిగినప్పటి నుంచీ ఐవైఆర్ నవ్యాంధ్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.