: ఛత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్... ముగ్గురు మావోయిస్టుల మృతి


ఛత్తీస్ గడ్ రాష్ట్ర రాజధానికి 450 కిలోమీటర్ల దూరంలోని కటేకల్యాణ్ (దంతెవాడ జిల్లా) ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు ఇవాళ కూంబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారని అధికారులు తెలిపారు. వారి మృతదేహాల వద్ద భారీగా ఆయుధాలు లభించాయని చెప్పారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News