: తొడగొట్టి సవాలు చేయడానికి ఇదేమన్నా బాలకృష్ణ సినిమానా?: కవిత


తొడగొట్టి సవాలు చేయడానికి ఇదేమన్నా బాలకృష్ణ సినిమానా? అని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత చమత్కరించారు. హైదరాబాదులో జర్నలిస్టు సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సవాలు చేయడానికి, తొడగొట్టడానికి అవకాశం లేదని అన్నారు. హైదరాబాదు పట్టణానికి ఏం చేయాలో వివరించాలి తప్ప తొడలు కొట్టుకుని, సవాళ్లు విసురుకోవడానికి కాదని ఆమె స్పష్టం చేశారు. తాము ఏం చేయాలనుకుంటున్నామో అదే చెబుతున్నామని ఆమె తెలిపారు. ఎంఐఎం, బీజేపీల్లాంటి పార్టీలు బీఫ్ ప్రచారం అంటున్నాయి, రెండు మతతత్వ పార్టీలు మత రాజకీయాలు అంటూ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. తాము అలా కాదని హైదరాబాదు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News