: బీఫ్ తినాలో వద్దో, ఏ మతాన్ని అనుసరించాలో ఎవరికి వారే నిర్ణయించుకుంటారు: టీఆర్ఎస్ ఎంపీ కవిత
తెలంగాణలో ఎవరు ఏం తినాలి, ఎవరు ఏ మతాన్ని అనుసరించాలి? అనే దానిని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించదని ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఎవరు ఏం తినాలో, ఎవరిని పూజించాలో వారే నిర్ణయించుకుంటారని, అది వ్యక్తిగత విషయమని, అలాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం తలదూర్చదని అన్నారు. మతతత్వ రాజకీయాలకు టీఆర్ఎస్ వ్యతిరేకమని ఆమె స్పష్టం చేశారు. ఎంఐఎం, బీజేపీ, టీడీపీ పార్టీలు నెగిటివ్ ప్రచారంతో విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తున్నాయని ఆమె తెలిపారు. తాము అలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రజలను ఆకట్టుకునేందుకు వివాదాస్పద అంశాలను లేవనెత్తుతున్నాయని ఆమె ఆరోపించారు.