: 3 నెలల గరిష్ఠానికి బంగారం ధర... 10 గ్రాములు రూ.27వేలు
కొత్త ఏడాది మొదటి నెలలోనే బంగారం ధర పెరుగుతూపోతోంది. ఇవాళ మార్కెట్ లో రూ.380 పెరిగిన పసిడి ధర మూడు నెలల గరిష్ఠానికి చేరుకుంది. దాంతో 10 గ్రాములు రూ.27,130కి పలుకుతోంది. మునుముందు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దాని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక వెండి ధర కూడా ఇవాళ ఏకంగా రూ.760 పెరిగింది. దాంతో కేజీ వెండి రూ.35,260కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు పెరగడంతో దాని ధర పెరిగిందని మార్కెట్ వర్గాలు చెప్పాయి.