: నాకు న్యాయం చేయాలి...చిరంజీవిని కలవలేదు: 'కత్తి' కథకుడు ఎన్.నరసింహారావు
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కథ తనది అంటూ పోరాటం చేస్తున్న కథారచయిత ఎన్.నరసింహారావు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కథ తనది అని చెబుతూ 24 క్రాఫ్టుల సంఘాలన్నింటినీ కలిశానని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా తన కథను విన్న ప్రతి ఒక్కరూ ఇది తన కథే అని అంగీకరించారని ఆయన తెలిపారు. దీంతోనే తనకు మద్దతుగా సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు. ఇందుకు తనకు సంతోషంగా ఉందని చెప్పిన ఆయన, ఈ విషయం ఇప్పుడే తనకు తెలిసిందని అన్నారు. సంఘాలన్నీ బాసటగా నిలవడంతో తనకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందుకు ధన్యవాదాలు చెప్పారు. యూనిన్ల నిర్ణయమే తన నిర్ణయమని గతంలో లిఖితపూర్వకంగా హామీ పత్రం అందజేశానని ఆయన చెప్పారు. ఈ విషయంపై ఇంతవరకు చిరంజీవిని కలవలేదని ఆయన తెలిపారు. సమస్య పరిష్కారానికి ఆయనను కలవడంపై తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఏదయినా సంఘాల నిర్ణయమే తన నిర్ణయమని ఆయన తెలిపారు.