: పాప్ సింగర్ బియాన్సేని చంపేస్తానని బెదిరింపులు


పాప్ సింగర్ బియాన్సేకి బెదిరింపులు వచ్చాయి. ఈ మధ్య బియాన్సే తల్లి టీనా లాసన్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో కుమార్తె బియాన్సే ఫోటోలు పోస్టు చేశారు. ఈ ఫోటోలను విమర్శిస్తూ ఓ ఆగంతుకుడు పోస్టులు పెట్టాడు. విమర్శలతో ఆగని ఆగంతుకుడు బియాన్సేను చంపేస్తానని అభ్యంతరకరంగా వ్యాఖ్యానించాడు. దీంతో పలువురు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై టీనా లాసన్ కూడా ఎఫ్బీఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో ఆగంతుకుడిని పట్టుకుంటామని అధికారులు హామీ ఇచ్చారని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News