: నర్సీపట్నం విద్యుత్ సబ్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నం
విశాఖ జిల్లా నర్సీపట్నంలో విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన నివాసంలో నిద్ర మాత్రలు మింగడంతో చికిత్స కోసం ఆయనను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్సకు సహకరించడం లేదని, దీనివల్ల ఆయన ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. డీఏ, ఏఈ వేధింపులు తట్టుకోలేకే అతను ఇలా చేసినట్టు తెలుస్తోంది. తాను తెలంగాణకు చెందిన దళితుడిని కావడం వల్లే తన పట్ల వివక్ష చూపుతున్నారని శివప్రసాద్ ఆరోపిస్తున్నారు. అయితే వారం రోజులుగా ఆయన సెలవు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు.