: 28 అవార్డులు తెచ్చిన వారిని ఉద్యోగాల్లోంచి తొలగించారు: ప్రభుత్వంపై జగన్ ఫైర్


రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర ద్వారా 28 అవార్డులు తెచ్చి పేరుతెచ్చిన సిబ్బందిని రెగ్యులరైజ్ చేయకుండా ఉద్యోగాల్లోంచి తొలగించారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కాకినాడలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరు వేల మంది ఆరోగ్య మిత్ర సిబ్బందిని విధుల నుంచి తప్పించారని మండిపడ్డారు. క్లస్లర్ స్కూళ్ల పేరుతో ఉన్న స్కూళ్లను తొలగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'రాష్ట్రంలో లక్షా నలబై రెండు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు ఉన్నాయని చెబుతున్నారు. మిగిలిన ఉద్యోగాలు భర్తీ చేస్తారని విద్యార్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు' అని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన తెలిపారు. తెలంగాణలో లక్ష ఉద్యోగాలు ప్రకటిస్తే పదో తరగతి అర్హత గలిగిన పోస్టులకు డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు చేసిన వారే ప్రయత్నిస్తున్నారని తేలిందని, మరి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఇంకెత దారుణంగా ఉంటుందో తెలుసుకోవచ్చని ఆయన సూచించారు. ప్రభుత్వాలు ప్రజల కష్టాలు పట్టించుకోకపోతే ఏం చేస్తాయని ఆయన నిలదీశారు. డిఎస్సీ నిర్వహించి రిజల్ట్ ప్రకటించి ఆగిపోయారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News