: నెల్లూరు జిల్లాలో పదవసారి భూప్రకంపనలు


ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఇవాళ మళ్లీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని వింజమూరులో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దాంతో స్థానికులు భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. భూమి లోపల నుంచి సుమారు 5 కిలో మీటర్ల మేర భూమి కంపించినట్టు వాతావరణ నిపుణులు నిర్ధారించారు. అయితే గత 3 నెలల వ్యవధిలో ఇప్పటికి పదిసార్లు భూమి కంపించింది. దాంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో అని ఇక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News