: కదలకుండా ఒకే చోట కూర్చోవడం నాకు అసహ్యం: శరద్ పవార్


ఒకే చోట కదలకుండా కూర్చోవడం అంటే తనకు అసహ్యమని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అస్వస్థతకు గురైన ఆయన పూణేలోని రూబీ హాల్ ఆసుపత్రిలో మూడు రోజుల కిందట చేరారు. దీంతో మూడు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాలని, ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన మూడు రోజులు ఆసుపత్రిలో గడిపారు. నేటి ఉదయం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలపడంతో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలా ఒకే చోట కూర్చోవడం తనకు అసహ్యమని అన్నారు. రానున్న మూడు నెలలు ఊపిరిసలపని షెడ్యూల్ ఉందని ఆయన చెప్పారు. అలాంటప్పుడు తాను ఒకే చోట ఎలా ఉండగలనని ఆయన పేర్కొన్నారు. అలా కూర్చోవడాన్ని తాను అసహ్యించుకుంటానని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News