: నా ప్రపంచాన్ని కౌగిట్లో బంధించాను: అసిన్ భర్త తొలి ట్వీట్


సినీ నటి అసిన్, వ్యాపారవేత్త రాహుల్ శర్మల వివాహం ఇటీవలి కాలంలో టాకాఫ్ ది ఇండస్ట్రీ అయింది. వీరి ప్రేమ వివాహం క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం కొద్ది మంది సెలబ్రిటీల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. వివాహానంతరం వీరిద్దరూ సంప్రదాయ మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. పెళ్లి రోజు అసిన్ కొన్ని ఫోటోలను పోస్టు చేసి, తనకు పెళ్లయిన విషయాన్ని అభిమానులకు తెలియజేసింది. రాహుల్ శర్మ మాత్రం వాటన్నింటికీ దూరంగా ఉన్నాడు. వివాహానంతరం తొలిసారి అసిన్ ను గుండెలకు హత్తుకున్న ఫోటోను నేడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, 'నా ప్రపంచాన్ని రెండు చేతులతో బంధించాను' అంటూ వ్యాఖ్య పెట్టారు. దీనికి వారి అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

  • Loading...

More Telugu News