: నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయాలని అనితాబోస్ విజ్ఞప్తి


ఇటీవల విడుదల చేసిన డిజిటల్ పత్రాల ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన ఒక్కొక్క విషయం బయటపడుతున్న సమయంలో ఆయన కుమార్తె అనితాబోస్ ఓ విజ్ఞప్తి చేశారు. జపాన్ లోని టోక్యో రెంకోజీ ఆలయంలో ఉన్న బోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆమె కోరారు. దాని ద్వారా ఆ అస్థికలు తన తండ్రివో కాదో తేలుతుందన్నారు. తైపీలోని తైహోకు విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తానూ నమ్ముతున్నానని తెలిపారు. ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న తాను వచ్చేనెల భారత్ కు వచ్చే అవకాశం ఉందని, అప్పుడు డీఎన్ఏ పరీక్ష గురించి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తానని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News