: కాంగ్రెస్ 15 సీట్లు గెలిస్తే, తెలుగుదేశం డిమాండ్ తీరుస్తానన్న తలసాని!
గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 15 సీట్లలో గెలవగలిగితే, తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తలసాని శ్రీనివాసయాదవ్ ప్రకటించారు. ఈ ఉదయం ఓ టెలివిజన్ చానల్ నిర్వహించిన ముఖాముఖిలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇతర నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధిపై వాదోపవాదాలు పెరుగగా, తలసాని సవాల్ విసిరాడు. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న హైదరాబాద్ అభివృద్ధిని తామే చేశామని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు గొప్పలు చెప్పుకుంటున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. గ్రేటర్ పీఠం తెరాసదేనని అన్నారు. కాగా, తమ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండా తెరాసలో తలసాని కొనసాగుతున్నాడని, తక్షణం ఆయన మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం చాలా నెలలుగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కాంగ్రెస్ 15 సీట్లు గెలిచి, తలసాని తన సవాల్ పై నిలబడితే, తెలుగుదేశం కోరిక తీరినట్టేగా!