: ట్యాంక్ బండ్ వద్ద వీహెచ్ మౌనదీక్ష
తెలంగాణ కాంగ్రెస్ సీనియన్ నేత వి.హనుమంతరావు ట్యాంక్ బండ్ పై మౌనదీక్షకు దిగారు. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్షకు దిగారు. ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన ఈ మౌనదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా, రోహిత్ కుటుంబ సభ్యలకు, సస్పెన్షన్ కు గురైన విద్యార్థులకు న్యాయం జరగాలని ఆయన డిమాండ్ చేశారు. అలా జరగాలంటే ఈ ఘటనకు కారకులైన వారిని శిక్షించాలని ఆయన సూచించారు.