: ఉస్మానియా యూనివర్శిటీలో మరో ఉద్రిక్తత

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ ఘటనలో నేడు దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల బంద్ జరుగుతుండగా, ఉస్మానియా వర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వర్శిటీ వైస్ చాన్స్ లర్ అప్పారావులను తొలగించాలన్న నినాదాలతో పెద్ద ఎత్తున విద్యార్థులు పాలనా భవంతి వద్ద నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులు వీరిని అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం, తోపులాట జరిగాయి. స్వల్ప లాఠీ చార్జ్ చేసిన పోలీసులు విద్యార్థులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలతో ఉస్మానియా మీదుగా వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.