: అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్


అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించడాన్ని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. దానిపై కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. రాజకీయ సంక్షోభం నెలకొన్న కారణంగా అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి రెండు రోజుల కిందట ఆమోదముద్ర వేశారు. దాంతో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. మొన్నటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్లింది.

  • Loading...

More Telugu News